ప్రణయ రాగం

కలలు కళ్ళలో కోలువైనప్పుడు
కవిత వెల్లువై కదిలినప్పుడు
మల్లెలు మనసును మురిపించినప్పుడు
మనసు ఊహలో తేలినప్పుడు
ఎదలోని మౌనరాగం తూనీగలా
నీ చెవిలో మెల్లగా నా ప్రేమను తెలిపినప్పుడు
మంచు వర్షం నీమీద కమ్మగా నీ మనసును తడుపుతుంటే
నా ఆత్మరాగం నీ గుండెను చేరి కదిలించి
మన అనురాగం కావ్యమై నిలిచే కలకాలం

Popular posts from this blog

a touching heart