నీతో చెప్పాలని



మనసులోని మాటలన్నీ
మదినిదోచి మెల్లగా
మానస వీణ మీటగా
ప్రనయరాగం యెదలో
మేల్లగాచేరి మధుర భావం
పలికించగా ,
కురిసే వెన్నెల నీ హృదయంగా
ఆకాశ తారలు నీ పెదవి చిరునవ్వుగా
వికసించే పువ్వుల పరిమళం
నీ మృదువైన మనసును జ్ఞాపకం చెయ్యగా
మెల్లగా వీచే చిరుగాలి
నీ ప్రేమని నాలో మురిపించగా
ఏకాంతంగా మనం వేరువేరుగా ఉన్నా
మన మనసులు మాత్రం చాల దూరం
పయనించి ఎకంకాగా
ఆ క్షణం ఆగక యుగముగా సాగిపోవాలి
ఆ మధురానుభూతి చాలు
జీవితమంతా జీవించడానికి :)

Popular posts from this blog

a touching heart